తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. శ్రీ సీతారామచంద్ర స్వామివారి వసంత పక్ష తిరుకళ్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు నవాహ్నిక మహోత్సవాలకు వేద పండితులు అంకురార్పణ నిర్వహించారు. స్వామివార్లకు పంచామృతాలతో అభిషేకం, విశేష స్నపనం, మృత్సంగ్రహణం, వాస్తు పూజలు నిర్వహించారు.