AP: టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారం మరింత ముదిరింది. సొంత పార్టీనే ఆయనను టార్గెట్ చేస్తూ అల్టిమేటం జారీ చేసింది. అయితే ఈ వ్యవహారం వెనుక వైసీపీ ఉందన్న చర్చ ఇప్పుడు తెర మీదికి వచ్చింది. ఈ విషయంపైనే టీడీపీ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక వైసీపీ నేతలతో కొలికపూడి కలిసి తిరుగుతున్నారని పార్టీకి సమాచారం అందింది. త్వరలో కొలికపూడి వైసీపీ బాటపట్టే అవకాశం ఉందని టాక్. అందుకే సొంత పార్టీపై కొలికపూడి రెచ్చిపోతున్నారట.