బాణాసంచా దుకాణాలను తనిఖీ చేసిన వెలిగండ్ల ఎస్ఐ

286చూసినవారు
బాణాసంచా దుకాణాలను తనిఖీ చేసిన వెలిగండ్ల ఎస్ఐ
దీపావళి పర్వదినం సందర్బంగా కనిగిరి నియోజకవర్గం వెలిగండ్ల మండలంలో ఏర్పాటు చేసిన బాణాసంచా దుకాణాలను స్థానిక ఎస్ఐ మహేష్ కుమార్ తనిఖీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ. అనుమతులు లేకుండా టపాసుల దుకాణాలను నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రమాణాలకు లోబడి షాపులను నిర్వహించాలన్నారు. ఇసుక, నీళ్లు, తదితరాలను దగ్గరలో ఉంచుకోవాలన్నారు.

ట్యాగ్స్ :