కొమరోలు: డెంగ్యూ జ్వరంతో చిన్నారి మృతి
కొమరోలు పట్టణంలోని శ్రీరామ్ నగర్ వీధిలో 10 నెలల చిన్నారి సాత్విక డెంగ్యూ జ్వరంతో సోమవారం మృతి చెందింది. వారం రోజుల నుంచి చిన్నారి జ్వరంతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు నంద్యాలలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకువెళ్లారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితి మార్పు కనిపించకపోవడంతో వైద్యుల సలహా మేరకు కర్నూలులోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందినట్లుగా కుటుంబ సభ్యులు తెలిపారు.