ద్వారక చర్లలో 1000 సంవత్సరాల గుడి ప్రాచీన దేవాలయాన్ని రక్షించుకుందాం...
ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ద్వారక చర్ల గ్రామంలో వెయ్యి సంవత్సరాలకు ముందు నిర్మించిన ప్రాచీన దేవాలయం శిధిలావస్థకు చేరుకుంది. దాదాపు 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ప్రాచీన దేవాలయం ప్రత్యేకత దేవాలయం మొత్తం రాతితో నిర్మించబడింది. ఈ దేవాలయం పేరు జనార్ధన స్వామి దేవాలయం విష్ణుమూర్తి అంశగా పిలువబడే జనార్ధనస్వామిని ఈ గ్రామ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు. శ్రీ కృష్ణ దేవరాయలు పాలించిన కాలం కన్నాచాలా సంవత్సరాల ముందు ఈ దేవాలయం నిర్మించారు. ఈ దేవాలయం ప్రత్యేకత దేవాలయం మొత్తం రాతితో నిర్మించడం అంతే కాకుండా ఇక్కడ రాసిన శాసనాలు భాష ఇంతవరకు ఎవరికి అర్థం కాకపోవటం ఓ ప్రత్యేకత ఈ దేవాలయం ధ్వజ స్తంభంపై దేవాలయంలోని గోడలపై లిఖించిన కొన్ని అక్షరాలు ఏ భాషకు సంబంధించినదో ఇంతవరకు ఎవరికీ అర్థం కాకపోవడం ఆశ్చర్యపరుస్తుంది.
అంతే కాకుండా ఇక్కడ దేవాలయం సమీపంలో గుర్రాల బావి ఉంది. రాజుల కాలంలో ఈ గుర్రాల బావిలో స్నానం ఆచరించి రాజులు, భక్తులు జనార్థన స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించేవారు అంట. పూర్వం శిల్పులు రాతిపై చెక్కిన కొన్ని దేవతల ప్రతిమలు శిల్పకళ అద్భుత నైపుణ్యాన్ని ఔరా అనిపిస్తాయి. కాలక్రమేణలో దేవాలయం ప్రత్యేకత అంతరించిపోతు రాజుల కాలంలో నిర్మించిన కొన్ని నిర్మాణాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా ఇక్కడ రాజుల కాలంలో నిర్మించిన కోనేరు పూర్తిగా అంతరించిపోయింది.
అయినా కానీ ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకత ఉంది. దేవాలయంలోకి ప్రవేశించగానే ఏదో భక్తి భావం ఏర్పడుతుంది. రోజు సాయంత్ర సమయంలో సూర్యకిరణాలు ఈ జనార్ధన స్వామి పాదాలను తాకుతూ పాదాభివందనం చేస్తున్నట్లుగా దర్శనమిస్తాయి.
అయితే ఈ దేవాలయం మనుగడ ప్రశ్నార్థకంగా మారింది శిథిలావస్థకు చేరుకోవడంతో ఆందోళన చెందుతున్నారు
ఈ దేవాలయాన్ని గ్రామ ప్రజలు వారి శక్తికి మించి దేవాలయాన్ని సంరక్షించుకుంటూ ఉన్నారు
ఎంతో ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని సంబంధిత అధికారులు కానీ ఎవరైనా దాతలు గాని ముందుకు వచ్చి దేవాలయ అభివృద్ధికి తోడ్పడాలని ఆ గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు. ఎంతో ప్రాచీనమైన దేవాలయాలను మనం కాపాడుకోవాల్సిన* బాధ్యత మన పైన ఉందంటూ గ్రామస్తులు ప్రజలు కోరుతున్నారు.