కొమరోలు మండలంలోని రాజుపాలెంలో మద్యం మత్తులో యువకుడు కత్తితో హల్ చల్ చేసిన సంఘటన గురువారం ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామ ప్రజలను బూతులతో దూషిస్తూ కత్తితో బెదిరిస్తూ వీరంగం సృష్టించాడు. సమాచారాన్ని అందుకున్న పోలీసులు వీరంగం సృష్టిస్తున్న యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసు స్టేషన్ కు తరలించి మద్యం మత్తు దిగిన తర్వాత యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చి యువకుడిపై కేసు నమోదు చేశామని ఎస్సై వెంకటేశ్వర నాయక్ తెలిపారు.