కొండేపి: ఉధృతంగా ప్రవహిస్తున్న అట్లేరు వాగు

57చూసినవారు
కొండేపి: ఉధృతంగా ప్రవహిస్తున్న అట్లేరు వాగు
ప్రకాశం జిల్లా కొండేపి మండలం చిన్న కల్లగుంట తాటాకుపాలెం గ్రామాల మధ్య అట్లేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. గత 2 రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను కారణంగా కొండేపి పరిసర ప్రాంతాలలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం అట్లేరు వాగుకు వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఉదృతంగా ప్రవహిస్తున్న వాగును ఎవరు దాటకుండా అధికారులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తూ భద్రతను ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్