మెదరమెట్ల వద్ద రోడ్డు ప్రమాదం
కొరిసపాడు మండలం మేదరమెట్ల వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మార్టూరు నుంచి శిల్పాల లోడుతో చెన్నై వెళుతున్న లారీ ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో వెనక లారీలో ఉన్న క్లీనర్ ప్రభాకర్ కు తీవ్ర గాయాలు, డ్రైవర్ కుమార్ కు స్వల్ప గాయాలు కావడంతో వారిని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు. హైవే పోలీసులు వెంకటరామయ్య, రాజాలు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు