అల్లకల్లోలంగా మారిన సముద్రం
ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో భారీ ఎత్తున అలలు ఎగిసిపడుతున్నాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు తీరప్రాంత మండలాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం జిల్లాకు చేరుకున్నారు. మత్య్సకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలించారు.