15 నాటికి ఈ-పంట నమోదు పూర్తి చేయాలి
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ కు సంబంధించి ఈ-పంట నమోదు ప్రక్రియ ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు మంగళవారం అధికారులను ఆదేశించారు. కొత్తపట్నం మండలం రాజుపాలెంలో జరుగుతున్న ఈ-పంట నమోదును మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ పరంగా అందే రాయితీతో పాటు, ప్రోత్సాహకాలకు ఈ-పంట ప్రామాణికం కావడంతో సాగుదారులు అందరూ నమోదు చేసుకోవాలన్నారు.