కేసీఆర్ తిరిగి ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో పని చేద్దాం: కేటీఆర్ (వీడియో)

55చూసినవారు
TG: కేసీఆర్‌ మళ్లీ సీఎం కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. కేసీఆర్‌ 71వ పుట్టినరోజు సందర్భంగా సోమవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన వేడుకలలో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. "కేసీఆర్‌.. తెలంగాణ కారణజన్ముడు. కేసీఆర్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసేందుకు గట్టిగా పనిచేద్దాం. రానున్న మూడున్నరేళ్లు 60 లక్షల గులాబీ దండు.. ఇదే లక్ష్యంతో ముందుకెళ్లాలి" అని కేటీఆర్‌ పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్