AP: రాష్ట్రంలో గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) కేసులు కలకలం రేపుతున్నాయి. కేసులు భారీగా పెరుగుతుండటంతో సీఎం చంద్రబాబు సోమవారం తన నివాసంలో సమీక్ష నిర్వహిస్తున్నారు. మంత్రి సత్యకుమార్, అధికారులతో కలిసి వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. బాధితులకు మెరుగైన చికిత్స అందించడానికి ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకోనున్నారు.