Apr 26, 2025, 08:04 IST/
జూన్ నుంచి కైలాస మానస సరోవర్ యాత్ర
Apr 26, 2025, 08:04 IST
జూన్ నుంచి కైలాస మానస సరోవర్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ శనివారం ప్రకటన విడుదల చేసింది. జూన్ నుంచి ఆగస్టు వరకు కైలాస మానస సరోవర్ యాత్ర కొనసాగుతుందని కేంద్రం వెల్లడించింది. కొవిడ్ నేపథ్యంలో 2020లో నిలిపివేసిన కైలాస మానస సరోవర్ యాత్రను ఈ వేసవిలో పునఃప్రారంభించాలని భారత్, చైనాలు సంయుక్తంగా నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం నేడు ఈ ప్రకటన చేసింది.