మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ఆదివారం సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందించారు. రూ. 2 లక్షల 73 వేలు విలువ చేసే చెక్కులు ఐదుగురికి పంపిణీ చేశారు. వీరు వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రులలో చికిత్స పొందారు. సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకోగా వారికి చెక్కులు అందించినట్లుగా ఎమ్మెల్యే తెలిపారు. పేదల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే నారాయణరెడ్డి అన్నారు.