Feb 07, 2025, 17:02 IST/
పంట రుణాలు మాఫీ చేయాలి: బీజేపీ చీఫ్ అన్నామలై
Feb 07, 2025, 17:02 IST
రాష్ట్రంలోని రైతుల పంట రుణాలను మాఫీ చేసేందుకు డీఎంకే ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్లాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అధికారంలో రావడానికి అలవిగాని హామీలతో ప్రజలను నమ్మించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డీఎంకే ఈ నాలుగేళ్ల పాలనలో హామీలను సక్రమంగా నెరవేర్చలేదన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఆయన మంత్రివర్గం ప్రజల సంక్షేమాన్ని, రాష్ట్ర అభివృద్ధిని పక్కనబెట్టిందన్నారు.