AP: టీడీపీ ఎమ్మెల్యేలు గాడి తప్పినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు హెచ్చరిస్తున్నా కొందరు ఎమ్మెల్యేలు మాట వినడం లేదట. కూటమి అధికారంలోకి వచ్చిన కొద్దిరోజులకే ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో బయటకు వచ్చి నానా రచ్చ లేపింది. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి వరుస వివాదాలు, చింతమనేని, ఎక్సైజ్ ఉద్యోగుల విషయంలో నరసరావుపేట ఎమ్మెల్యే అరవింద్ వైఖరి, జేసీ ప్రభాకర్ వివాదాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయి.