TG: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) విద్యార్థులను బీజేపీ రెచ్చగొడుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. మంగళవారం హైదరాబాద్ లో అయన మాట్లాడుతూ HCUకి బీజేపీ సెంటు భూమి కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థులకు నష్టం జరిగేలా చేయదని ఆయన వెల్లడించారు. కోర్టుల్లో పోరాటం చేసి 400 ఎకరాలు దక్కించుకున్నామన్నారు. న్యాయస్థానాలకు లోబడి సీఎం రేవంత్ పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.