ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఈ ఏడాది ఫిబ్రవరిలో 97 లక్షల ఖాతాలను బ్యాన్ చేసినట్లు ప్రకటించింది. ఇందులో 14 లక్షల ఖాతాలను ముందస్తు జాగ్రత్త చర్యగా ఎటువంటి ఫిర్యాదులు లేకుండానే బ్యాన్ చేసినట్లు వెల్లడించింది. వాట్సాప్ నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించిన అకౌంట్లను గుర్తించి, మోసపూరిత కార్యకలాపాలు, నకిలీ సమాచార ప్రచారం, అనైతిక కార్యకలాపాల కారణంగా వీటిని తొలగించినట్లు తెలిపింది.