రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మృతదేహం లభ్యం
తుని రైల్వే పోలీస్టేషన్ పరిధిలో గుర్తుతెలియని వ్యక్తి (35) మృతి చెందాడని జీఆర్పీ ఎస్ఐ శ్రీనివాసరావు అన్నారు. ఆయన వివరాల మేరకు తుని డీమార్ట్ వెనక గల రైల్వే ట్రాక్ వద్ద రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందాడన్నారు. మృతుడు ఎవరనేది తెలియరాలేదని, నీలం రంగు టీషర్ట్, స్కై బ్లూ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడని వివరించారు. ఎడమ చేయిపై అజయ్ అని పచ్చబొట్టు ఉందని, వివరాలు తెలిసిన వారు సమాచారం ఇవ్వాలన్నారు.