ప్రకాశం జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పనిచేస్తున్న 33 మంది కానిస్టేబుళ్లను బదిలీ చేస్తున్నట్లుగా ఎస్పీ దామోదర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో కానిస్టేబుళ్లలో కొందరికి నిర్దేశిత కాలపరిమితి పూర్తయిన వారు కాగా బదిలీ చేసినట్లుగా ఎస్పీ తెలిపారు. వారిని వెంటనే రిలీవ్ చేయాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్లకు ఎస్పీ దామోదర్ ఉత్తర్వులు జారీ చేశారు.