బ్లాక్ పెరల్ గ్రానైట్ అసోషియేషన్ రూ.50.50లక్షల విరాళం
వరద బాధితులను ఆదుకునేందుకు బ్లాక్ పెరల్ గ్రానైట్ క్వారీ అసోషియేషన్ ప్రతినిధులు ముందుకు వచ్చారు. పల్నాడు, బాపట్లకు చెందిన ఆయా సంస్థల ప్రతినిధులు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ను రాష్ట్ర సచివాలయం వెలగపూడిలో కలిసి రూ.50,50,000 చెక్కును గురువారం అందజేశారు.