ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర స్థాయి విస్తృత సమావేశాలు ఒంగోలులో జరుగుతున్నాయి.రెండవ రోజైన శుక్రవారం సమావేశానికి వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి. వెంకట్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ కార్మికుల సమస్యల పరిష్కారానికి క్షేత్రస్థాయిలో పోరాటాలు చేసి, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.