సింగరాయకొండ: ఇద్దరు మహిళలు అదృశ్యం
ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండలో ఇద్దరు మహిళలు అదృశ్యమైన సంఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. వేరువేరు కుటుంబాలకు చెందిన ఇద్దరు మహిళలు అదృశ్యమయ్యారని వారి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని ఎస్సై మహేంద్ర తెలిపారు. అదృశ్యమైన వారిలో సుందర్ నగర్ కాలనీకి చెందిన ఓ మహిళ ఉండగా ఆంజనేయ నగర్ కు చెందిన మరో మహిళ కూడా ఉన్నట్లుగా ఎస్ఐ వెల్లడించారు. వీరి అదృశ్యంపై దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.