సింగరాయకొండ: మద్యం కోసం ఎగబడ్డ మద్యం ప్రియులు
సింగరాయకొండలో మద్యంప్రియలు బుధవారం మద్యం కోసం ఎగబడ్డారు. ప్రభుత్వం నూతన మద్యం పాలసీ ప్రవేశపెట్టిన నేపథ్యంలో నూతన మద్యం షాపులు తెరుచుకున్నాయి. ఒంగోలు డిపో నుంచి మద్యం రావడం ఆలస్యం కావడంతో మద్యం ప్రియులు గంటల తరబడి వేచి చూశారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో మద్యం రావడంతో ఒక్కసారిగా మద్యం ప్రియులు క్యూ కట్టారు. సింగరాయకొండలో 6 మద్యం షాపులు ప్రారంభం కావాల్సి ఉండగా కేవలం ఒక్కటి మాత్రమే బుధవారం తెరుచుకుంది.