ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌

84చూసినవారు
ముగ్గురు పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌
జిల్లాలోని రెండు గ్రామ పంచాయతీల్లో అక్రమాలకు పాల్పడిన ముగ్గురు గ్రామ పంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు పడింది. దీంతో ముగ్గురు కార్యదర్శుల సస్పెన్షన్‌ ఉత్తర్వులను ఆయా ఎంపీడీవోలకు డీపీవో పంపారు. మండల కేంద్రమైన సింగరాయకొండ పంచాయతీ కార్యదర్శి జె.రామకోటయ్య, మద్దిపాడు మండలం దొడ్డవరప్పాడు పంచాయతీ ఇన్‌చార్జి కార్యదర్శి పి.శ్రీనివాసులు, పెదకొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి ఎన్‌.వినోద్‌ను కూడా సస్పెండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్