ప్రకాశం జిల్లా, త్రిపురాంతకం మండలం మేడిపి గ్రామంలోని పలు దుకాణాలను సీఐ శివ బసవరాజు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓ దుకాణంలో అక్రమంగా నిలువ ఉంచిన దీపావళి బాణా సంచాను ఎస్సై స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అక్రమంగా బాణాసంచా నిలువ ఉంచిన వ్యక్తిపై కేసు నమోదు చేశామని స్వాధీనం చేసుకున్న బాణాసంచా విలువ రూ. 5 వేలు ఉంటుందని ఎస్సై తెలిపారు. అక్రమంగా నిలువ ఉంచటం చట్టారీత్యా నేరమని శివ బసవరాజు హెచ్చరించారు.