ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం గ్రామపంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఈనెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు సదరు కార్యాలయంలో విచారణ అధికారులు చేపట్టనున్నారు. ప్రస్తుత పంచాయతీ కార్యదర్శి పంచాయతీ ఖాతాలోని నిధులు దుర్వినియోగం అయినట్లుగా జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ విచారణకు ఆదేశించడంతో ఉన్నత అధికారులు ఈనెల 30న విచారణ జరిపి నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తామని బుధవారం తెలిపారు.