ప్రకాశం; కేంద్రీయ విద్యాలయంలో ఘనంగా క్రీడా వార్షికోత్సవ వేడుకలు
ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లి గ్రామంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో 3వ వార్షికోత్సవ క్రీడా దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు వేటపాలెం ఎమ్.ఎస్.పి.ఏ.పి.బి.సి. డబ్ల్యూ. ఆర్ పాఠశాల ఫిజికల్ ఉపాధ్యాయురాలు మమత పాల్గొన్నారు. పలు పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రిన్సిపాల్ కర్తార్ సింగ్ గర్జర్, ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు. పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.