పెద్దారవీడు మండలం తోకపల్లి వద్ద బొలెరో, ద్విచక్ర వాహనం ఢీకొన్నాయి. ఈ సంఘటనలో ఓ వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందగా మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. 108 అంబులెన్స్ లో గాయపడ్డ వ్యక్తిని మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బొలెరో, ద్విచక్ర వాహనాన్ని తప్పించ క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. జరిగిన రోడ్డు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని మృతుడి వివరాలు తెలియవలసి ఉందన్నారు.