యర్రగొండపాలెం మండలం గురుజేపల్లి గ్రామంలో ఆదివారం స్థానిక సీఐ ప్రభాకర్ రావు ఆధ్వర్యంలో కార్డెన్ సర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించడంతో పాటు అనుమానితులను పోలీసులు ప్రశ్నించారు. సరైన ధ్రువపత్రాలు లేని 14 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని సీఐ తెలిపారు. జిల్లాలో చెడ్డి గ్యాంగ్ కదలికలు ఉన్న నేపథ్యంలో ఎస్పీ ఆదేశాల మేరకు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నామని ప్రభాకర్ రావు చెప్పారు.