లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు (వీడియో)

63చూసినవారు
విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ప్రైవేట్ బస్సు లారీని ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటన నెల్లూరు జిల్లా దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా.. 10 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్