AP: గేమ్ ఛేంజర్ ఈవెంట్‌కు హాజరై తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆ ఇద్దరు అభిమానుల కుటుంబాలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హీరో రామ్ చరణ్ పరిహారం ప్రకటించారు. దీనిపై వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. 'పుష్పకేమో నీతులు చెప్తారా.. గేమ్ ఛేంజర్‌కు పాటించరా!' అని పవన్ కళ్యాణ్‌ను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.