ప్రస్తుతం కలకలం సృష్టిస్తోన్న HMPV వైరస్ మరీ అంత ప్రమాదకరం కాదని వైద్యులు తెలుపుతున్నారు. తాజాగా భారత్‌లోనూ మూడు కేసులు వెలుగుచూడడంతో పలువురు భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే ఇది కరోనా వైరస్‌లా ప్రమాదకరం కాదని వైద్యులు సూచిస్తున్నారు. చిన్నపిల్లల్లో, వృద్దుల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో HMPV సంక్రమించే అవకాశం ఉందని, వైరస్ సోకిన 4-7 రోజుల్లో కోలుకుంటారని వివరించారు.