AP: బాపట్ల జిల్లా వైసీపీ నేత, మాజీ మంత్రి మేరుగు నాగార్జునపై అత్యాచారం కేసు నమోదైంది. కాంట్రాక్ట్ పనులు, ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేశాడని, తన దగ్గర డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని విజయవాడకు చెందిన ఓ మహిళ తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనను బలవంతంగా అత్యాచారం చేశాడని బాధిత మహిళ తెలిపింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.