TG: వికారాబాద్ జిల్లాలో దారుణమైన ఘటన చోటుచోసుకుంది. దోమ మండల పరిధిలోని గుండాల్ గ్రామానికి చెందిన 8వ తరగతి బాలికపై.. ముగ్గురు మైనర్లతో సహా ఐదుగురు వ్యక్తులు శుక్రవారం సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితులు గంజాయి మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. కాగా, పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.