యూఎస్‌లోని మిస్సోరి ఫెస్ట్‌స్‌కు చెందిన స్కార్లెట్ సెల్బీ (7) అనే బాలిక రీల్స్ అనుకరిస్తూ కోమాలోకి వెళ్లింది. టిక్‌టాక్‌లో క్యూబ్ ఆకృతిని మార్చే రీల్ చూసి.. దాని ఛాలేంజ్‌గా తీసుకుని వీడియోలో చూపించినట్లు ఆ క్యూబ్‌ను తొలుత ఫ్రీజ్ చేసి తర్వాత ఒవెన్‌లో ఉంచింది. దానిని బయటకు తీయడంతో ఒక్కసారిగా క్యూబ్ పేలి అందులో ఉన్న ద్రవం ముఖం, ఛాతిపై పడింది. కొంత ద్రవం నోరు, ముక్కులోకి వెళ్లడంతో బాలిక కోమాలోకి వెళ్లింది.