ఏసీబీ వలలో రావులపాలెం సీఐ (వీడియో)

62చూసినవారు
అంబేడ్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీస్ స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. కోళ్ల పందెం కేసులో అరెస్ట్ అయిన వారిని విడిపించే విషయంలో సీఐ ఆంజనేయులు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. దాంతో బాధితులు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్లాన్‌తో లంచం తీసుకుంటుండగా.. సీఐ ఆంజనేయులును అధికారులు పట్టుకున్నారు. అతడిని విచారించి శాఖాపరమైన చర్యలకు ఆదేశించారు.