మమ్మల్ని మళ్లీ విధుల్లోకి తీసుకోండి: వాలంటీర్లు

84చూసినవారు
మమ్మల్ని మళ్లీ విధుల్లోకి తీసుకోండి: వాలంటీర్లు
AP: త‌మ‌ను మళ్లీ విధుల్లోకి తీసుకోవాల‌ని ఎమ్మెల్యేలు, అధికారుల‌కు ఎన్నికల ముందు రాజీనామా చేసిన వాలంటీర్లు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. వైసీపీ నేత‌లు బ‌ల‌వంతం చేయ‌డం వ‌ల్ల.. తప్పనిసరి పరిస్థితుల్లోనే రాజీనామా చేశామ‌ని వాపోతున్నారు. తమను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లోనూ ఇదే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. కాగా ఎన్నికల ముందు 1.08 లక్షల మంది వాలంటీర్లు రాజీనామా చేసిన విష‌యం విదిత‌మే.