బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి

53చూసినవారు
బ్యాటరీ మింగేసిన 11 నెలల చిన్నారి
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన 11 నెలల పాప ఆడుకుంటూ శనివారం బొమ్మలోని ఓ చిన్న బ్యాటరీని మింగేసింది. తల్లి వెంటనే గుర్తించి స్థానిక ఆస్ప‌త్రికి తీసుకెళ్లగా.. వైద్యులు ప‌రీక్షించి విజ‌య‌వాడకు తీసుకెళ్లాల‌ని సూచించారు. దీంతో హుటాహుటిన విజయవాడలోని ఆయుష్ ఆస్ప‌త్రికి పాప‌ను తీసుకోచ్చారు. కడుపు, ఛాతి మధ్య భాగంలో బ్యాటరీ ఇరుకున్న‌ట్లు గుర్తించిన వైద్యులు.. ఎండోస్కోపీ ద్వారా బ్యాటరీని బ‌య‌ట‌కు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్