గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆంక్షలు

76చూసినవారు
గన్నవరం ఎయిర్‌పోర్టులో ఆంక్షలు
విజయవాడలో రేపు చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనుండటంతో గన్నవరం ఎయిర్‌పోర్టులో ఉదయం 10 నుంచి సా.4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని వెల్లడించారు. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీ, అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొననున్నారు.

సంబంధిత పోస్ట్