ముంబై సినీ నటి జెత్వానీ కేసులో కీలక మలుపు తిరిగింది. నటి తమకు భూమి అమ్మలేదని ఈ కేసులో కీలక సాక్షిగా పేర్కొన్న చిందా వీరవెంకట నాగేశ్వరరాజు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం కోసం వైసీపీ నేత విద్యాసాగర్‌కు ఆధార్ కార్డులిస్తే.. తనను, తన అల్లుడిని ఈ కేసులో అన్యాయంగా ఇరికించారంటూ ఆరోపించారు. ఈ మేరకు కూచిపూడి పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు.