వర్షాకాలంలో కరెంటు ప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్తలను పాటించండి

1061చూసినవారు
వర్షాకాలంలో కరెంటు ప్రమాదాలు జరగకుండా ఈ జాగ్రత్తలను పాటించండి
వర్షాకాలంలో విద్యుత్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. వర్షాకాలంలో తడిసిన కరెంటు స్తంభాలను, విద్యుత్ లైన్లు తగిలి ఉన్న చెట్లను ముట్టుకోకూడదు. స్విచ్ బోర్డులను తడి చేతులతో పట్టుకోవద్దు. గాలి దుమారం, వర్షం వల్ల తెగిన తీగలను ముట్టుకోవద్దు. వర్షాలు, ఉరుముల వేళ కరెంటు తీగల కింద నిలబడకూడదు. ఇళ్లలో 20 ఏళ్లకు పైగా ఉన్న పాత సర్వీస్ తీగలు మార్చుకోవాలి. ఏదైనా ఎలక్ట్రానిక్ పరికరాన్ని ఉపయోగించే ముందు పాదాలకు రబ్బరు చెప్పులు ధరించండి.

సంబంధిత పోస్ట్