బైక్‌తో సహా వాగులో కొట్టుకుపోయిన వ్యక్తి (వీడియో)

559చూసినవారు
ఏపీలోని పలు ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండల పరిధిలోని ముప్పాళ్ల గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో శనివారం ఓ వ్యక్తి వాగు దాటే ప్రయత్నం చేశాడు. వాగు దాటే క్రమంలో అతను కిందపడి బైక్‌తో సహా ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

సంబంధిత పోస్ట్