ఏపీ 'ది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' అయితే రిలయన్స్ 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సీబీజీ ప్లాంట్లను మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు. దీని ద్వారా యువతకు ఉపాధి కల్పనతో పాటు రైతుకు లీజు పాలసీ ద్వారా రూ.30 వేలు చొప్పున వచ్చేలా ప్రణాళిక వేస్తున్నామన్నారు. క్లీన్ ఎనర్జీ పాలసీ 2024 ఇప్పటికే తీసుకువచ్చామని సీఎం తెలిపారు.