ఓబీసీలను విభజిస్తేనే కాంగ్రెస్కు ఆక్సిజన్ అని.. అందుకే కుల రాజకీయాలు చేసేందుకు సిద్ధమైందని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. కులగణన పేరుతో కొత్త కుట్రకు తెరలేపారని అన్నారు. బీసీలు ఐక్యంగా ఉంటేనే సేఫ్గా ఉంటారని సూచించారు. కాగా, మహారాష్ట్రలో అధికారంలోకి వచ్చిన వెంటనే కులగణన చేస్తామని కాంగ్రెస్ కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ స్పందించి కీలక వ్యాఖ్యలు చేశారు.