శబరిమలలో మకరజ్యోతి దర్శనం కోసం భక్తులు ఎంతగానో వేచి చూస్తుంటారు. ఈ క్రమంలో ఈనెల 14న సంక్రాంతి పండుగరోజు జ్యోతి దివ్య దర్శనం కానుంది. దీంతో ముందస్తుగానే వేలాది భక్తులు శబరిమలకు పోటెత్తారు. దీంతో ఆ ప్రాంతం మొత్తం స్వాములు, భక్తులతో నిండిపోయినట్లు తెలుస్తోంది. పంబ వరకు అయ్యప్ప భక్తుల క్యూ లైన్లు చేరుకున్నాయి. దర్శనానికి 12 గంటలకుపైగా సమయం పడుతున్నట్లు అధికారులు తెలిపారు.