ఏపీలోని 30 మండలాల్లో ఆదివారం తీవ్ర వడగాలులు వీస్తాయని APSDMA ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీకాకుళం-7, విజయనగరం-11, మన్యం -10, ఏలూరు-1, ఎన్టీఆర్ జిల్లాలోని 1 మండలంలో తీవ్ర వడగాలులు వీస్తాయని పేర్కొంది. మరో 67 మండలాల్లో వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరించింది.