వనజీవి రామయ్య మృతికి సంతాపం తెలిపిన మోదీ

73చూసినవారు
వనజీవి రామయ్య మృతికి సంతాపం తెలిపిన మోదీ
తెలంగాణకు చెందిన పద్మశ్రీ గ్రహీత, పర్యావరణ ప్రేమికుడు వనజీవి రామయ్య గుండెపోటుతో మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాజకీయ ప్రముఖులు, పర్యావరణ ప్రేమికులు ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఈ క్రమంలో తాజాగా ప్రధాని మోదీ కూడా ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 'దరిపల్లి రామయ్య సుస్థిరత కోసం గళం వినిపించిన వ్యక్తిగా గుర్తుండిపోతారు. లక్షలాది చెట్లను నాటడానికి, రక్షించడానికి ఆయన తన జీవితాన్ని అంకితమిచ్చారు’ అంటూ Xలో ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్