AP: వైఎస్ జగన్ ఫ్యామిలీ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇడుపులపాయలో జగన్ కుటుంబ సభ్యులు ముందస్తు క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. విజయమ్మతో పాటు జగన్, షర్మిల కొడుకు, కోడలు, అవినాష్ రెడ్డి, ఒకే చోట కలిశారు. దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. గత కొద్ది రోజులుగా జగన్ కుటుంబంలో ఆస్తి తగాదాలు నడుస్తున్న నేపథ్యంలో వీరంతా ఒక చోట వేడుకలు నిర్వహించడం హాట్ టాపిక్‌గా మారింది.