AP: వైఎస్సార్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల హెచ్ఎంలకు కడప జిల్లా విద్యాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పాఠశాలల్లో పిల్లల అపార్ నమోదు పూర్తి చేయలేదని, 829 మంది ప్రధానోపాధ్యాయులకు నోటీసులు ఇచ్చినట్లు విద్యాధికారి తెలిపారు. మూడు రోజుల్లో నోటీసుకు సమాధానం చెప్పాలని ఆదేశించారు. సమాధానం పంపకపోతే క్రమశిక్ష చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.